గీతమ్ విద్యార్థులకు కోవిడ్ టీకా…

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో బుధవారం కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జిల్లా అధికారుల సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15–18 ఏళ్ళ మధ్య వయస్కులకు టీకాలు వేయడంతో పాటు వయోజనులకు కోవాక్సిన్ రెండో డోసు ఇచ్చారు . 15 నుంచి 18 ఏళ్ళ పిల్లలకు టీకాలు వేయాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు విరివిగా పాల్గొనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు . 15 నుంచి 60 ఏళ్ళ వయస్సు గల వారు టీకా డ్రైవైకు హాజరై అది విజయవంతం కావడానికి తమవంతు సహాయ సహకారాలను అందజేశారు . భానూరు పీహెచ్సీ డాక్టర్ స్వప్న , జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి పెంటయ్యలు ఈ కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమానికి స్వయంగా హాజరై పర్యవేక్షించారు

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *