మనవార్తలు ,పటాన్ చెరు;
దక్షిణ కొరియా ప్రభుత్వ మద్దతుతో , ఇండో – కొరియన్ ప్రాజెక్టులో భాగంగా గీతమ్ హెదరాబాద్లో ఏర్పాటు చేసిన నాలుగు విండ్ టర్బెన్లను నలుగురు సభ్యులతో కూడిన కొరియా బృందం బుధవారం సందర్శించింది . గాలి వేగాన్ని పర్యవేక్షించడం , స్వదేశీ – కొరియా నమూనాల పనితీరును పోల్చడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ తెలియజేశారు . ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నిర్వహణలో తలెత్తే సాంకేతిక సమస్యలను గీతం నిపుణులు పరిష్కరిస్తారని చెప్పారు . ఆర్కిమెడిస్ విండ్ టర్నెన్లను ఎక్కడ ఉంచినా , ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే డేటాను విశ్లేషించడానికి ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని గీతం యోచిస్తోందన్నారు .
ఈ ప్రాజెక్టు కోసం ఎస్కో – ఆర్టీఎస్ , చెంజూ విశ్వవిద్యాలయం , జేఐఎస్ , గీతం , ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు డాక్టర్ శ్రీనివాస్ వివరించారు . ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు బీక్ జూన్ హో నేతృత్వంలో రినస్ మెరిమాట్యూస్ , యాంగ్ , కిమ్లతో కూడిన ఎస్కో – ఆర్టీఎస్ , కొరియా ప్రతినిధుల బృందం గీతమన్ను సందర్శించి , గాలి టర్బెన్లను విజయవంతంగా అమర్చిన స్థానిక పరిశోధకులను అభినందించినట్టు డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు .
గీతం ఉపకులపతి దయానంద సిద్దవటం , గీతం – హెదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్ . సీతారామయ్యలను ఈ బృందం కలిసినట్టు చెప్పారు . స్థానిక ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ కె.రాజగోపాల్ , ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ సీఈవో – ఎండీ సూర్యప్రకాష్ గజ్జల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు . కాగా , గీతం పరిశోధనా సమన్వయకర్త డాక్టర్ ఐవీ సుబ్బారెడ్డి , అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పీవీ రామకృష్ణ , శ్రీ వీకే శ్రీధర్లు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసినట్టు ఆయన పేర్కొన్నారు .