గిరిజన విద్యార్థులకు సైన్స్ పై అవగాహన…

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ ప్రాంతంలోని గిరిజన/గ్రామీణ పాఠశాల విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం (సెన్ట్స్)పై అవగాహన ఏర్పరచి, కార్యాచరణ ఆధారిత అభ్యాసం ద్వారా శాస్త్రం పట్ల వారి వెఖరిని మార్చే లక్ష్యంతో వెజ్ఞానిక ప్రదర్శన, క్విజ్ పోటీలను హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్నది. క్రిస్టలోగ్రఫీ సొసెట్టీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో, విద్యార్థులకు చేరువయ్యే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జనగామ జిల్లా, పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలో ఈనెల 15వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఎం.ఎస్. సురేంద్రబాబు, డాక్టర్ టీ.బీ.పాత్రుడు తెలియజేశారు.

కార్యాచరణ ఆధారిత అభ్యాసం (యాక్టినిటి బేస్డ్ లెర్నింగ్) ద్వారా సెన్స్డ్ పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి, వారి వెఖరిలో పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పాలకుర్తి మండలం, ఆ చుట్టుపక్కల గిరిజన విద్యార్థులకు సమీకరించి, ప్రముఖ పరిశోధకులు, ఆచార్యులతో సెన్స్డ్ ప్రాముఖ్యతను వివరించడం, సెన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం, క్విజ్ పోటీలు, నమూనాల ప్రదర్శన వంటివి నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. ఆయా పోటీల విజేతలకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అతిథిగా పాల్గొంటారని కన్వీనర్లు వివరించారు.

ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను ఉచితంగానే నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ ఎగ్జిబిషన్లో రసాయన, భౌతిక, గణిత శాస్త్ర నమూనాలను మాత్రమే ప్రదర్శించడానికి అవకాశం కల్పించనున్నట్టు వారు స్పష్టీకరించారు. మరిన్ని వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్తలు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల 70136 02236 / డాక్టర్ కటారి 9177712000లను సంప్రదించాలని, లేదా scienceexpo@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *