పటాన్ చెరు
పటాన్ చెరు మండలం భానూర్ గ్రామంలోని శ్రీ ధన మైసమ్మ అమ్మవారి బోనాల జాతరకు 15000 రూపాయలు విరాళం అందజేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలు ఈ సారి ఘనంగా జరుగుతుతాయిని అన్నారు తెలంగాణలో బోనాల పండగకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహిస్తారు. అమ్మారికి బోనాల సమర్పణ, పోతురాజుల నృత్యాలు, ఘటాల ఊరేగింపు, డీజే ఆటపాటలతో సందడిగా ఉంటుందని చల్లని తల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం.. అష్ట దేవతల్లో శ్రీ ధన మైసమ్మ భోనాలు అంగరంగ వైభవంగా జరపాలన్నారు. బోనాలు జాతరలో పాల్గొనే భక్తులు అందరు మాస్క్ లు మరియు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు . అమ్మవారు ప్రజలను సుఖసంతోషాలతో చల్లగా చూడాలని కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు .ఈ కార్యక్రమంలో నరేందర్, సతీష్, శివ, రామ్ దాస్, రాజేష్, నర్సింలు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.