Districts

మహిళల స్వీయ రక్షణకు కరాటే తోడ్పాటు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

ప్రస్తుత సమాజంలో మహిళల స్వీయ రక్షణకు కరాటే తోడ్పాటు అందిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ ముగింపు పోటీలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జిఎంఆర్ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరాటే, కుంగ్ ఫు విద్యలు శారీరకంగా, ఆరోగ్యపరంగా మానసిక ఉల్లాసాన్ని అందించడంతోపాటు స్వీయ రక్షణకు ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని అన్నారు. విద్యార్థి దశ నుండే బాల బాలికలకు కరాటేలో శిక్షణ ఇప్పించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు.

రాష్ట్రస్థాయిలో కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను పటాన్చెరులో ఏర్పాటు చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. టోర్నమెంట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుz ఒరిస్సా, కేరళ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు రాజు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, టూర్ నిర్వాహకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,.

విజేతల వివరాలు..

కరాటే గర్ల్స్ క్యాటగిరి లో చంద్రిక
ఫస్ట్ ప్లేస్ అండ్ గ్రాండ్ చాంపియన్షిప్ కప్ విన్నర్ బీరంగూడ.

కరాటే బాయ్స్ కేటగిరి ఏం ఏ ఖాజా
ఫస్ట్ ప్లేస్ అండ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ న్యూ సిటీ

కుంగ్ ఫూ గర్ల్స్ కేటగిరి బూష్యు రా
ఫస్ట్ ప్లేస్ అండ్ గ్రాండ్ చాంపియన్షిప్ కప్ విన్నర్ సంగారెడ్డి

కుంగ్ ఫూ బాయ్స్ గ్రూప్ కేటగిరి అంజి కుమార్
ఫస్ట్ ప్లేస్ అండ్ గ్రాండ్ చాంపియన్షిప్ కప్పు విన్నర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago