సక్సెస్ శోటోకాన్ కరాటే 11వ రాష్ట్రస్థాయి చాంపియన్ షిప్ 2025 పోటీలు ప్రారంభించిన నీలం..
నీలంకు ఘన స్వాగతం పలికి, సన్మానించిన నిర్వాహకులు
కరాటే పోటీదారులు నిర్వహకులను అభినందించి సన్మానించిన నీలం మధు ముదిరాజ్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
స్వీయ క్రమశిక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ కు కరాటే విద్య ఎంతో ఉపయోగపడుతుంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపాలిటీ మోకీల పరిధిలోని పిఆర్ఆర్ గార్డెన్స్ లో ముఖ్య నిర్వాహకుడు టీ కుమార్ మరియు స్పాన్సర్ మన్నె వెంకటేష్ గార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ స్టేట్ లెవెల్ సక్సెస్ శోటోకాన్ కరాటే చాంపియన్ షిప్-2025 పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసం ఉపయోగపడే కరాటే విద్య వ్యాయామంగాను పనికొస్తుందన్నారు. మహిళలు తమ ఆత్మరక్షణ కోసం కరాటే ను నేర్చుకోవాలని ఆయన సూచించారు. కరాటే శిక్షణ అందిస్తూ మరియు ఎంతోమంది కరాటే సాధకులకు పోటీలు నిర్వహిస్తున్న సక్సెస్ షోటోకన్ కరాటే నిర్వాహకులు కుమార్, స్పాన్సర్ వెంకటేష్ ను ఆయన అభినందించారు. రానున్న కాలంలో కరాటే సాధకులకు తన సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.