పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గురువారం జ్యోతిరావు ఫూలే వర్ధంతి పురస్కరించుకుని చిట్కుల్ లోనీ నీలం మధు నివాసంలో ఫూలే చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్. ఆయన మాట్లాడుతు అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు విద్య, మహిళోద్ధరణకు కృషి చేసిన గొప్ప వ్యక్తి ఫులే అని, ఆయన దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశి అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్య కోసం పనిచేశారని గుర్తుచేశారు, ఆయన బాట సమాజనికి అనుసరణీయం అని నీలం మధు అభిప్రాయపడ్డారు