రైతు సదస్సులో పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్

Hyderabad politics Telangana

జిన్నారం  

సోలక్ పల్లి రైతు వేదికలో రైతులకు వివిధ పంటలపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు సైంటిస్టులు పాల్గొని రైతులకు పలు సూచనలు తెలియజేశారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి రైతు తన పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతులు పంట పై ఆధారపడకుండా వివిధ కూరగాయలు పళ్ళు ఆకుకూరలు పంట పై అవగాహన కల్పించి రైతులు లాభాల బాటలో నడవాలని అధికారులు సూచించారు.

వివిధ రకాల వ్యవసాయ పద్ధతులను ఆర్గానిక్ వ్యవసాయం పై మక్కువ పెంచుకోవాలని సూచించారు అలాగే రైతులు పండించే పంటకు రసాయన ఎరువులు ఎలా వాడాలో కీటకాలకు పురుగులకు తెగలకు సంబంధించిన అనేక విషయాలపై సుదీర్ఘంగా రైతులతో చర్చించడం జరిగింది.

పండించిన రైతు ప్రతి పంటకు నష్టపోకుండా మార్కెట్లో ఉన్న గిట్టుబాటు ధర అమ్ముకోవాలని ని వివిధ రకాల పంటలు వేయడం వల్ల ప్రతి రైతు లాభాల బాటలో ఉంటాడని రైతులకు సూచించారు .ఈ కార్యక్రమంలో జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ,ఏ డి ఏ సురేష్ బాబు, ఏవో రవీంద్రనాథ్రెడ్డి ,గంగ మల్లు , శైలజ యోగేశ్వర్ రెడ్డి, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *