మైత్రి మైదానంలో భారీ ఏర్పాట్లు
భారీ సంఖ్యలో హాజరుకానున్న విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు, అధికారులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 21వ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుండి 9 గంటల వరకు పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో భారీ స్థాయిలో యోగా దినోత్సవం వేడుకలు ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో.వివిధ శాఖల అధికారులు, యోగ నిర్వహణ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మైత్రి మైదానంలో. యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగ అనే పదం పరమాత్మతో మనస్సు యొక్క అనుసంధానం ఫలితంగా పరిపూర్ణమైన సమస్థితిని లేదా మానసిక సమతుల్యతను సూచిస్తుందని తెలిపారు. యోగ దినోత్సవం లో ప్రతి ఒక్కరి పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిఐ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.