పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వ్యర్థాల నిర్వహణ – వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, ఐపీఎల్ అంతర్జాతీయ ఫోరమ్ 2024 పై 14వ అంతర్జాతీయ సదస్సును గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చలు, విజ్ఞాన భాగస్వాన్యూన్ని సులభతరం చేయడానికి ఈ యేడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1న తేదీ వరకు ఈ సద స్సును హైబ్రీడ్ విధానంలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.ఈ సమావేశంలో వ్యర్థాల నిర్వహణ, వృత్తాకార ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన అనేక ఇతివృత్తాలు, వ్యర్థాలు, విధానాలు, నిబంధనలు, ఇంజనీరింగ్, సాంకేతికత, సామాజిక, వ్యాపారం, పరిశ్రమలు, వ్యవస్థాపకత వంటివి ఉంటాయని తెలియజేశారు. సదస్సులో భాగంగా కీలకోపన్యాసాలు, ప్లినరీ చర్చలు, ప్రత్యేక సాంకేతిక కార్యక్రమాలు, ప్యానెల్ చర్చలు వంటివెన్నో ఉంటాయన్నారు.విద్యారంగ ప్రతినిధులు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలలో పనిచేసేవారు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు, ఆరోగ్య పరిరక్షణ సంస్థలు, ఇతర ఆసక్తిగల వారు సెప్టెంబర్ 15లోపు 35-0005 jponswm.ce@gmail.com/jconswmce@gitam.edu అని వారు సూచించారు. నిర్దిష్ట ప్రవేశ రుసుము చెల్లించి వ్యక్తిగతంగా లేదా ఆన్ లైన లోసదస్సుకు హాజరు కావచ్చని, అలాగే కాన్ఫరెన్స్ ఈ-ప్రొసీడింగ్ లను కూడా ప్రచురిస్తామన్నారు .ఈ సదస్సుతో పాటు, స్కూల్ కాంగ్రెస్, హ్యాకథాన్, ఇండస్ట్రీ ఎక్స్ పో , ప్రీ-కాన్ఫరెన్స్ డాక్టోరల్ వర్క్ షాప్ ను నవంబర్ 27న నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం సదస్సు చెర్మన్ ప్రొఫెసర్ సాధన కె.ఘోష్ 98300 44464, నిర్వాహకుడు డాక్టర్ వైఎల్ . పీ. థోరన్ 888 678 5076లను సంప్రదించాలని సూచించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…