పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని మైత్రీ స్టేడియంలో ఈ నెల 4 నుంచి ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ 2023 ను ప్రారంభించనున్నట్లు ఎండీఆర్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. పృథ్వీరాజ్ తెలిపారు.పటాన్చెరులోని ఎండీఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు పటాన్ చెరు ప్రాంతంలోని కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు మానసికోల్లాసం, స్నేహభావం పెంపొందేందుకు ప్రతి ఏటా ఈ టోర్నమెంట్ ను జరపనున్నట్లుతెలిపారు. ఈ టోర్నమెంట్ ను ఈ నెల 12 వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఇక్రిషాట్, బీహెచ్ఈఎల్, తోషిబా తదితర కంపెనీల ఉద్యోగులు పాల్గొననున్నట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడుతామని ఎండీఆర్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. పృథ్వీరాజ్ తెలిపారు.స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అంజనేయ గౌడ్ పాల్గొంటారని అన్నారు.

