politics

భారతీయ సంస్కృతి ని కాపాడాలి – వెంకయ్య నాయుడు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

కుటుంబ వ్యవస్థ ను కాపాడుతూ భారతీయ సంస్కృతి ని కాపాడాలని మాజీ ఉప రాష్ట్రపతి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహిత ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం రోజు గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో గల అన్వయ కన్వీన్షన్ హల్ లో సుజనా చౌదరి, డాక్టర్ కామినేని శ్రీనివాస్ లు వెంకయ్య నాయుడు ను ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ అభినందన సభలో అయన మాట్లాడుతు నేటి రాజకీయo లో చాలా మార్పులు వచ్చాయని, మంచి నాయకులను ఎన్నుకోవాలని, అప్పుడే మన సమాజం బాగుంటుందని సమాజ బాగుకోసం పాటు పడాలని సూచించారు. నేటి పిల్లలు సృజనాత్మకథను కోల్పోయి, ఆర్టిఫిషియల్ గా తయారవుతున్నారని, చిన్నప్పటి నుండే సంస్కృతి, సాంప్రదాయాల గురించి నేర్పించాలని, దేశాన్ని, తల్లితండ్రులను ప్రేమించేలా నేర్పించాలన్నారు. ఎలక్రానికి వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. నిరాడంబరుడు, స్నేహ శీలి, అయిన వెంకయ్య నాయుడు లాంటి గొప్ప వ్యక్తులను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు సుజనా చౌదరి, మురళి మోహన్, కెవిపి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

5 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

5 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

5 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

2 weeks ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

2 weeks ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

2 weeks ago