పాశమైలారంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్, తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

politics Telangana

_సొంత నిధులతో చత్రపతి శివాజీ విగ్రహాన్ని అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్, తెలంగాణ తల్లి విగ్రహాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. 2 లక్షల 50 వేల రూపాయల సొంత నిధులతో ఎమ్మెల్యే జీఎంఆర్ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మహనీయుల చరిత్రను తెలియజేయాలన్న సమన్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయం అని అన్నారు. పారిశ్రామిక వాడలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.

ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, గ్రామ ఉపసర్పంచ్ కృష్ణ యాదవ్, సీనియర్ నాయకుడు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చందు, వీరేశం గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

అమీన్పూర్ లో..

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ సాయి కాలనీలో పదో వార్డ్ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *