5 కోట్ల 8 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లెను ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి, ఇస్నాపూర్ చిట్కుల్, రుద్రారం, లకడారం, ఘనాపూర్, పాటి, కర్ధనూర్, నందిగామ గ్రామాల్లో 5 కోట్ల 8 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సిసి రోడ్లను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నూతన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పథకం గ్రామాల రూప రేఖలను మార్చిందని తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు, వీధి దీపాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్లు అందించడం జరిగిందని తెలిపారు. పరిశుభ్రత పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపడుతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తూ తాగునీటి కొరతను అధిగమించడం జరిగిందని తెలిపారు. 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును అందిస్తూ ప్రగతి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, ఎంపీడీవో బన్సీలాల్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఉపేందర్, బాలమణి శ్రీశైలం, సుధీర్ రెడ్డి, సువర్ణ మాణిక్ రెడ్డి, కావ్య కాశిరెడ్డి, లక్ష్మన్, ఉమామతి గోపాల్, భాగ్యలక్ష్మి, నీలం మధు, ఎంపీటీసీలు అంజిరెడ్డి, శ్రీశైలం, మంజుల శ్రీశైలం యాదవ్, మన్నె రాజు, హరి ప్రసాద్ రెడ్డి, నాగజ్యోతి, నీనా చంద్రశేఖర్ రెడ్డి, శైలజ, మాధవి నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *