Telangana

పటాన్ చెరు,దౌల్తాబాద్ ఆర్ అండ్ బి రోడ్డు వెంటనే మరమ్మతులు చేపట్టాలి

సిపిఎం పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు,ఏరియా కమిటీ సభ్యులు పి పాండురంగారెడ్డి

బచ్చి గూడ చౌరస్తా వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా దౌల్తాబాద్ వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డుకు వెంటనే మరమ్మత్తులతో పాటు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని సిపిఎం పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు,ఏరియా కమిటీ సభ్యులు పి పాండురంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని బచ్చు గూడ చౌరస్తా దర్గా వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంద్రేశం ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమన్నారు. ఈ రహదారి మీదుగా ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర భయాందోళన గురవుతున్నారని అన్నారు. ఇంద్రేశం రింగ్ రోడ్డు నుండి పెద్ద కంజర్ల పరిధి, శివానగర్ చౌరస్తా వైపు వెళ్లాలంటే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఉన్నాయని, రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలంటే సామాన్య ,మధ్యతరగతి, కార్మికులు, విద్యార్థులు, రైతులు నరక ప్రయాణం ఎదుర్కొంటున్నారని వాపోయారు.

ఇంద్రేశం, పెద్ద కంచర్ల ప్రాంతం జిల్లాలు, అపార్ట్మెంట్లు, కాలనీలతో శరవే గంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ రోడ్డు మీదుగా భారీ నుంచి అతి భారీ వాహనాలు కంకర, ఇసుక, స్టీలు తీసుకెళ్లే వాహనాలు ఈ రోడ్డు మీదనే ప్రయాణం చేస్తూ, పరిమితికి మించి ఓవర్ లోడ్ తో వెళ్లడంతో, రోడ్లు పూర్తిగా గుంతలు పడి దెబ్బతింటున్నాయని అన్నారు. గత సంవత్సరంలో గుంతలు పూడ్చివేయడంతో, తిరిగి మళ్లీ అవే గుంతలు పెద్దగా మారాయని అన్నారు, ఈ రోడ్డు గుంతలు పూడ్చడం కోసం రియల్ ఎస్టేట్ బిల్డర్ల వద్ద లక్షల రూపాయల్లో వసూలు చేసి కాంట్రాక్టర్లు రోడ్డు వేయడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు.రహదారి పునర్నిర్మాణం కోసం తగినన్ని నిధులు కేటాయించెలా ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రహదారి వేయడం కోసం కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే సాకు చూపి ఆర్ అండ్ బి అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్నారు.

అరబిందో కౌంటీ, అరబిందో తత్వ విల్లా టౌన్షిప్ లకు పరిమితికి మించిన ఓవర్ లోడులతో వెళుతుంటే ఏ ఒక్క అధికారి కూడా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించకపోవడం దారుణం అన్నారు. నరకం చూపిస్తున్న ఈ రహదారి సమస్యను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ప్రజలను సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సత్తిబాబు, సురేష్ కుమార్, నల్లగండ్ల రాజు, ప్రదీప్, గంగాధర్, బుచ్చిరెడ్డి, రామచందర్, సతీష్, నగేష్,శివరాజ్, రాములు ఇతరులు పాల్గొన్నారు

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

3 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

3 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

9 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

21 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

21 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

22 hours ago