మన వార్తలు , పటాన్ చెరు:
క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ అన్నారు. జార్ఖండ్ లో జరిగే జాతీయస్థాయి అండర్ 15 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో సెలెక్ట్ అయిన చిన్నారి పూజకు గురువారం ఆయన పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేశారని తెలిపారు క్రీడల్లో రాణించిన విద్యార్థులు మానసికంగా కూడా చాలా చురుకుగా ఉంటారని అన్నారు.
గతంలో క్రీడాకారులుగా ఎదిగిన వారందరూ కూడా సమాజంలో ఉన్నతమైన గౌరవం పొందుతున్నారని అన్నారు. అనేకమంది ఆ కోటాలో ఉద్యోగాలు సంపాదించి మంచి జీవితాన్ని గడుపుతున్నారని గుర్తుచేశారు. క్రీడాకారుల వల్ల ఆ గ్రామానికి, దేశానికి మంచి పేరు లభిస్తుందని అన్నారు. పూజ కూడా జాతీయస్థాయిలో మంచి క్రీడాకారిణిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నారుల ఎదుగుదలకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని స్పష్టం తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎట్టయ్య ముదిరాజ్, పైల్వాన్ చంద్రకాంత్ పాల్గొన్నారు.