– గీతం అతిథ్య ఉపన్యాసంలో అమెరికా నిపుణుడు శర్మ ద్రోణంరాజు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కర్బన ఉద్గారాలు లేని ఇంధనంగా హైడ్రోజన్, ప్రత్యేకించి ‘గోల్డ్’ హెడ్రోజనను వినియోగించడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయని, పర్యావరణ పరిరక్షణలో ఇది కీలక భూమిక పోషించనుందని హ్యూస్టన్ (టెక్సాస్, అమెరికా)లోని గ్లోబల్ ఎర్త్ అబ్జర్వేషన్ ఇన్స్టిబ్యూట్ డైరక్టర్ శర్మ ద్రోణంరాజు జోస్యం చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భవిష్య ఇంధనంగా హెడ్రోజన్” అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, స్థిరమెన్ష ఇంధన వనరుగా హిడ్రోజన్ వినియోగించవచ్చన్నారు. 2050కి ముందు హైడ్రోజన్ హై డ్రోకార్బన్లను 50 శాతం వరకు భర్తీచేయగల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉందని. చెప్పారు. ‘ఉపరితం హైడ్రోజన్ వ్యవస్థ యొక్క సంక్లిష్టతలను వివరిస్తూ, భూగర్భ హైడ్రోజన్ మూలాలు, ముంపు మువ్వులను పూర్తిగా అర్ధం చేసుకోవడానికి మరింత పరిశోధన, పెట్టుబడి అవసరమని ఆయన నొక్కిచెప్పారు. కచ్చిన ఉద్గారాల నివారణ కోసం తగిన అన్వేషణ, నియంత్రణ, రవాణాలో సాంకేతికతల యొక్క వేగవంతమైన పరిణామాన్ని కూడా ఆయన విశదీకరించారు. అధ్యాపకులు, విద్యార్థులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు జవాబులిస్తూ, ఇంధనంగా హైడ్రోజుతో సంబంధం ఉన్న లక్షణాలు వగాహనను అందించారు.మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సి.శ్రీనివాస్, ప్రొఫెసర్ సి. ఈశ్వర్, ప్రొఫెసర్ ఎస్. ఫణికుమార్ లతో కలిసి స్కూల్ ఆఫ్ చెక్సాలజీ డైరక్టర్ ప్రొఫెసర్ వి.రాముశాస్త్రి అతిథిని సత్కరించారు. వివిధ ఇంజనీరింగ్ నిభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.