WWW.ZEROCO.DE/SUPER100
హైదరాబాద్:
ఐటీ అప్లికేషన్స్ అభివృద్ది చేసేందుకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది . హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జోరో కోడ్ ఇన్నోవేషన్ సంస్థ ఐఐటీ కర్నూలు, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో సూపర్ 100 పేరుతో కొత్త కోర్సును రూపకల్పన చేసింది.
పది రోజుల కాలవ్యవధిగల ఈ కోర్సు నో కోడ్ టెక్నాలజీ ఫ్లాట్ ఫాం ఆధారంగా రూపొందించినట్లు జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ ప్రతినిధులు ప్రశాంత్, భరత్‌లు తెలిపారు .ఇంజనీరింగ్ ,నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు కంప్యూటర్ పై పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కోర్సుకు అర్హులని…ఈ కోర్సు పూర్తయిన వారిలో వంద మందికి తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు .
దీంతో పాటు మరో వంద మందికి ఇంటర్నషిప్ అవకాశం కల్పిస్తామని తెలిపారు . సూపర్ 100 కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్‌తో పాటు వెబ్‌సైట్లు, యాప్‌లు రూపొందించుకుని ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు .ఈ నెల 23 తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని…మే 29 నుంచి జూన్ 8 వ తేదీ వరకు కోర్సును అన్‌లైన్ ద్వారా అందిస్తామన్నారు . సాఫ్ట్ వేర్ రంగంలో కెరీర్ కొనసాగించాలనే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశమన్నారు.
నాన్ టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ విద్యార్థులు సైతం ప్రొగ్రామర్లుగా తీర్చిదిద్ది ..వారిని డిజిటల్ 2.O విప్లవంలో భాగస్వాములను చేయడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు . కోర్సు ఫీజు 7500 రూపాయలుగా నిర్ణయించారు. WWW.ZEROCO.DE/SUPER100 ద్వారా తమ వివరాలను ఎన్‌రోల్ చేసుకోవాలన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…