Telangana

హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024

మనవార్తలు ,హైదరాబాద్: 

రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న సంస్థలకు , ప్రముఖులకు 50 కి పైగా అవార్డులు, నామినేషన్ లకు ఆహ్వానం.మహా సిమెంట్స్ సమర్పించు హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024 అవార్డుల నామినేషన్ల ప్రక్రియ మరియు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్‌, మాసబ్ ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు కార్యక్రమంలో అవార్డుల నామినేషన్ల పోస్టర్ తో పాటు అవార్డును ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ కు టైటిల్ స్పాన్సర్ గా మహా సిమెంట్స్ వ్యవహరిస్తోంది. అలాగే వీర కాంక్రీట్ , ఎల్ఐసి హోసింగ్ ఫైనాన్స్, నాగార్జున టిఎంటి , ఫార్చ్యూన్ ఆర్ట్ ఎల్ఇడి లైటింగ్స్,సుధాకర్ పైప్స్ , ఫిట్టింగ్స్, బెల్జిన్ వైర్స్ కేబుల్స్ ,పెట్ హోమ్ ఆటోమేషన్, అభిమన్య డోర్స్, పవర్ టెక్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు టఫ్ స్టోన్స్ బ్లాక్స్ ,పెవర్స్ తమ సహకారాన్ని అందిస్తున్నారు.

నామినేషన్లకు ఆహ్వానం
———————-

రియల్ ఎస్టేట్ రంగంలో గత దశాబ్దాలుగా ఉత్తమమైన సేవలను అందిస్తూ ఈ రంగంలో రాణిస్తున్న ప్రముఖులను హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ 2024 ద్వారా ఘనంగా సత్కరిస్తూ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. జనవరి 25 వ తేది, హెచ్ఐసిసి నోవోటల్ లో ఈ అవార్డుల వేడుక జరుగనుంది. అవార్డుల కోసం వచ్చిన నామినేషన్ల ప్రక్రియ నిర్వహణలో భాగంగా హైబిజ్ టీవీ రియాల్టీ అవార్డ్స్ జ్యూరీ కమిటీలో రియాల్టీ రంగంతో పాటు విభిన్న రంగాల్లో వున్న జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణుల చేత అవార్డుల ఎంపిక జరుగనుంది. ఇందులో పరిశ్రమ అనుభవం, ప్రాజెక్ట్ కౌంట్, ప్రాజెక్టు వ్యయ ప్రమాణాల ఆధారంగా వివిధ విభాగాలలో 50 కి పైగా అవార్డులను జ్యూరీ కమిటీ నామినేట్ చేయనుంది.డిజిటల్ మీడియా రంగంలో సరి కొత్త పధ్దతిలో అత్యుత్తమంగా రాణిస్తున్న హైబిజ్.టివి భారత దేశంలో డిజిటల్ బిజినెస్ న్యూస్ ఛానెల్ లో ఒకటి. ప్రతి రోజు 5 లక్షలకు పైగా వీక్షకులను కలిగి విభిన్న రంగాలలో ప్రతిభను కనబరుస్తున్న వారి కథనాలను వీక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుంది.నిష్పాక్షిక మరియు పారదర్శకతతో రియల్ ఎస్టేట్ రంగంలో విజయం సాధించిన వారి కృషిని గుర్తిస్తూ.. ఆర్థిక వ్యవస్థ అభివృధ్దిలో తమ సహకారాన్ని అందిస్తూ సామాన్యుడి ఇంటి కలను సాకారం చేస్తున్న వారి కృషిని గుర్తిస్తోంది ఈ కార్యక్రమంలో వి.రాజశేఖర్ రెడ్డి,క్రెడాయ్ హైదరబాద్ ప్రెసిడెంట్, పి.నర్సింహా రెడ్డి,డైరెక్టర్, వీర ఆర్ఎంసీ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ , అదితి శ్రీమాల్, డైరెక్టర్, ఫార్చున్ ఆర్ట్ ఎల్ ఈడీ లైటింగ్, ప్రకాష్ రాగి, డైరెక్టర్ రాగి , ఎం. రాజగోపాల్ , పౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హైబిజ్ టీవీ , తెలుగు నవ్ పాల్గొన్నారు.

నామినేషన్ల కోసం ధరఖాస్తులకు చివరి తేదీ: 18-01-2024

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

53 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

60 minutes ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago