జువెలరీ కలెక్షన్స్ ను ఆవిష్కరించిన హీరోయిన్ ద్రిషిక…

Hyderabad Lifestyle Telangana

హైదరాబాద్

బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్‌గా సాగింది. హైదరాబాద్ పంజాగుట్ట మానేపల్లి జూవెలరీ షోరూంలో దసరా పండుగ సందర్భంగా సరికొత్త జువెలరీ కలెక్షన్స్‌ ను మోడల్స్‌తో కలిసిసంస్థ డైరెక్టర్ మురళీ కృష్ణ ఆవిష్కరించారు . పెళ్ళిళ్ళు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా జువెలరీ కలెక్షన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీ నటి ద్రిషిక చందర్ అన్నారు . మోడల్స్ బ్రైడల్,వెడ్డింగ్,ఫెస్టివ్ కలెక్షన్స్ ప్రదర్శిస్తూ నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది.

తెలుగు ప్రజల ముఖ్య పండుగ దసరా. ఈ దసరా నవరాత్రి పండుగ కు ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు , బంగారు అభరణాలు కొనుగోలు చేయడం అనవాయితీ . హైదరాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో అత్యంత అద్భుతమైన దసరా, వెడ్డింగ్ కలెక్షన్స్ మోడల్స్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మానేపల్లి జువెలర్స్ డైరెక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ దేశం యొక్క విభిన్న సంస్కృతి ,పండుగల ఆధారంగా డిజైన్లను మేము మానేపల్లి జ్యువెలర్స్‌లో నిర్వహిస్తున్నాము . పెళ్లిళ్లు ,పండుగ సమయంలో వివిధ ప్రాంతాలు, దేశవిదేశాలలో ప్రజాదరణ పొందిద్దన్నారు . మా కస్టమర్ల ప్రాధాన్యతలకు సరిపోయే సరికొత్త డిజైన్లు అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు . ఈ కొత్త కలెక్షన్స్ అందరికి ఎంతగానో నచ్చుతాయని తెలిపారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *