మనవార్తలు ,పటాన్ చెరు:
చిట్కుల్ గ్రామంలో సాయి దీప మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు .ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు .ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు ఆయన చెప్పారు.
యోగా, వ్యాయామం వంటివి ప్రతిరోజూ దైనొందిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసుకోవాలని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య సేవలు ప్రజలకు అందాలని అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే మందులు ఉండేవి కాదని ప్రస్తుతం అన్ని మందులు ప్రభుత్వాసుపత్రిలో ఇస్తున్నారని అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతోనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, వెంకటేశ్, కృష్ణ, బుజంగం, శ్రీను, మురళీ, వెంకటేశ్, రాజ్ కుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…