ఆరోగ్య సంరక్షణలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కీలక భూమిక

Telangana

_ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన అమెరికా నిపుణుడు డాక్టర్ మాథ్యూ సాలకల్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఆరోగ్య సంరక్షణలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కీలక భూమిక పోషించడంతో పాటు వివిధ కెరీర్ అవకాశాలను కూడా.. కల్పిస్తోందని అమెరికా’లోని ఇండియానా విశ్వవిద్యాలయం ఎమెరిటస్ ప్రొఫెసర్, ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ మాథ్యూ పాలకల్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సెన్స్డ్ అండ్ ఇంజనీరింగ్ విభాగంతో కలిసి స్కూల్ ఆఫ్ ఫార్మసీ నిర్వహించిన కార్యక్రమంలో “హెల్త్ ఇన్ఫర్మేటిక్స్”పై శుక్రవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు.ఆరోగ్య సంరక్షణలో బయో ఇన్ఫర్మేటిక్స్ కీలక పాత్రను ఆయన నొక్కి చెబుతూ, దానిపై లోతెన అవగాహనను కల్పించారు. అలాగే ఆ రంగంలో వివిధ కెరీర్ అవకాశాలను ప్రస్తావించడంతో పాటు, ఈ ఆశాజనక రంగాన్ని అన్వేషించేలా విద్యార్థులను ప్రేరేపించి, వారి భవిష్యత్తు విద్యా ప్రయత్నం గురించి నిర్ణయాలు తీసుకునేలా చేశారు.ఇటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విద్యార్థులలో అభ్యాసం, అన్వేషణ, ఆవిష్కరణం సంస్కృతిని గీతం : పెంపొందిస్తోంది. సీఎస్ఈ, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సీహెచ్. పవన్ కుమార్, డాక్టర్: దుర్గాప్రసాద్లు సమన్యయనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *