మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త విలేజ్ లో హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని నిత్య పూజలందుకున్న వినాయకుని లడ్డూ వేలం పాటలో ఒక లడ్డూ నూ హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు వేలం పాటలో 2,10,000 లకు పాడి దక్కించు కున్నారు. రెండవ లడ్డూ తండ నర్సింహ గౌడ్ దంపతులు 1,80,000 లకు పాడి దక్కించుకున్నారు. హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులకు, తండ నర్సింహ గౌడ్ దంపతులకు నిర్వాహకులు సత్కారం చేసి స్వామీ వారి కృపా కటాక్షములు వారి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండి వారు చేయబోయే కార్యాలలో విఘ్నాలు తొలగించి విజయాలు పొందాలని వారు ఆకాంక్షించారు.
