మనవార్తలు ,మెదక్
మెదక్ జిల్లా రేగోడ్ గ్రామంలో ఉన్న పురాతన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం
పునర్నిర్మాణం భాధ్యత ను ప్యారారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తెనుగు నర్సింలు ముదిరాజ్ తీసుకున్నట్లు ఆలయ పూజారి శివకుమార్, ఇతర సభ్యులు తెలిపారు. ముందుగా శుక్రవారం వారం రోజు 5 వేల రూపాయలు అద్వాన్స్ గా ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన రిషిప్ట్ ను దాత నర్సింలు ముదిరాజ్ కు ఆలయ పూజారి శివకుమార్ అందజేశారు.