-ఆతిథ్య ఉపన్యాసంలో గ్రామనర్ లీడ్ డేటా సెంటిస్ట్ ప్రవీణ్ కుమార్
పటాన్ చెరు:
వ్యాపార సమస్యను నిర్వచించడం , తగిన మోడళ్ళను ఎంచుకోవడం , పనితీరు కొలమానాలను ఉపయోగించి మూల్యాంకనం చేయడం , పరీక్షించిన మోడళ్ళతో పరిష్కారాలను రూపొందించడం వంటి వివిధ దశలలో డేటా అనలిటిక్స్ ప్రాధాన్యం పెరుగుతోందని గ్రామనర్ లీడ్ డేటా సెంటిస్ట్ ప్రవీణ్ కుమార్ వాసరి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని డేటా సెన్స్ విద్యార్థులకు ఆచరణాత్మక విద్యను అందజేయాలనే లక్ష్యంతో పారిశ్రామిక నిపుణులతో నిర్వహిస్తున్న ముఖాముఖిలో భాగంగా బుధవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .
రోజువారీ వ్యాపార లావాదేవీలతో సమకూరుతున్న డేటాను విశ్లేషించి తగిన సూచనలు చేసే విధానాల గురించి ఆయన విడమరిచి చెప్పారు . తొలుత గణిత శాస్త్ర సీనియర్ అధ్యాపకుడు ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు అతిథిని విద్యార్థులకు పరిచయం చేశారు . డేటా సెన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను ఆయన విద్యార్థులకు వివరిస్తూ , ఆ రంగ నిపుణుడితో ఏర్పాటు చేసిన ముఖాముఖిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , అధ్యాపకులు డాక్టర్ శివారెడ్డి శేరి , డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డితో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు .