_తొలి ఏడాది విద్యార్థులకు గీతం హెదరాబాద్ ప్రోవీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు ఉద్బోధ .
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
విద్య, అంతర్ విభాగ నైపుణ్యాలతో పాటు ఇతరత్రా కార్యకలాపాలలో చురుకుగా పాల్గొని సంపూర్ణ పరిణతి గల వ్యక్తులుగా ఎదగాలని తొలి ఏడాది విద్యార్థులకు గీతం హెదరాబాద్ ప్రో వెస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు) ఉద్బోధించారు. గీతం హెదరాబాద్లోని బీటెక్, ఎంటెక్, బీబీఏ, బీకాం, ఎంబీఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఏ, ఎంఏ, ఫార్మశీ, అర్కిటెక్చర్ కోర్సులలో చేరిన తొలి ఏడారి విద్యార్థుల ప్రవేశ (ఇండక్షన్) కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు.మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రొఫెసర్ డీఎస్ రావు స్వాగతం పలికి శుభాభినందనలు తెలియజేశారు. హెదరాబాద్ ప్రాంగణంలోని ఇంజనీరింగ్, మేనేజిమెంట్, సైన్స్, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్తో పాటు కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీల గురించి ఆయన సంక్షిప్తంగా వివరించారు. అంతర్ విభాగ విద్య, చెపుణ్యాలను సాధించడానికి ఇటువంటి సదుపాయం ఎంతో ఉపకరిస్తుందన్నారు. నిరంత మూల్యాంకన ప్రక్రియను గీతమ్ ఆచరిస్తున్నామని, వారాంతంలో ఏదో ఒక పరీక్ష నిర్వహించి, విద్యార్థుల ఎదుగుదలపై ఒక అవగాహనకు వస్తానుని చెప్పారు. అలాగే సొంతంగా పరిశ్రమలను నెలకొల్పాలనే వారికోసం వెంచర్ డెవలప్మెంట్ సెల్, -ఇంక్యుబేషన్ సెల్లను కూడా ఏర్పాటు చేశారున్నారు.
గీతలోని అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అత్యుత్తము విద్యకు 70 నుంచి 75 వేల నుంది పూర్వ విద్యార్థుల దన్ను ఓ ప్రత్యేకంగా డీఎస్ రావు అభివర్ణించారు. కార్యక్రమం ముగింపులో, బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ అక్కలక్ష్మి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ రెండు వారాల ఇండక్షన్లో ఏయే కార్యక్రమాలు చేపట్టబోతోంది, ప్రాంగణంలోని వనరులు,వెబ్సైట్లను వినియోగించే విధానం, ఇతరత్రా మౌలిక సదుపాయాలు, ఏయే తరగతులను నిక్కడ నిర్వహిస్తోంది.చెప్పడంతో పాటు ఆయా విభాగాల బాధ్యులను విద్యార్థులకు పరిచయం చేశారు.
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి, బీ-స్కూల్ డెరెక్టర్ ప్రొఫెసర్ వినయ్ కుమార్, సె స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్, హ్యుమానిటీస్ ఇన్ఛార్జి డెరైక్టర్ ప్రొఫెసర్ డీఆర్ చంద్రశేఖర్, ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్, అర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ తదితరులు తొలి ఏడాది విద్యార్థులను స్వాగతించడంతో పాటు తమ స్కూళ్ల గురించి క్లుప్తంగా వివరించారు.గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు డెరెక్టర్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.