_పెండింగ్ పనుల నిధులు మంజూరు చేయండి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గత ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం మంజూరైన పనులకు సంబంధించిన 475 కోట్ల రూపాయల నిధులను సత్వరమే మంజూరు చేయాలని, గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.పటాన్చెరువు మండలం కర్ధనూర్ గ్రామంలో శుక్రవారం ఒక కోటి 14 లక్షల 60 వేల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. గత దశాబ్ది కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలపడంతోపాటు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు జివిఆర్ ఎంటర్పై సౌజన్యంతో వివిధ కార్యక్రమాల చేపట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, పంచాయతీరాజ్ డి ఈ సురేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, గ్రామపంచాయతీ పాలక వర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…