Telangana

సాకి చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు..

సినీ, జానపద కళాకారులతో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పటాన్చెరు నియోజకవర్గంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపై అక్టోబర్ 18న నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ వేడుకల కోసం చేపడుతున్న ఏర్పాట్లను సైబరాబాద్ మునిసిపల్ అధికారులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.సద్దుల బతుకమ్మ సందర్భంగా పటాన్‌చెరు, జెపి కాలనీ డివిజన్లో పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన వేలాది మంది మహిళలు సాకి చెరువు కట్టకు తరలి వస్తారని.. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

మహిళలు, కుటుంబ సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక లైటింగ్, విశాలమైన పార్కింగ్, ఆకర్షణీయమైన వేదిక, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బతుకమ్మలను నిమజ్జనం చేసే ఘాట్ వద్ద భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకల్లో సినీ, జానపద కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీక అని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని మహిళలు పెద్ద సంఖ్యలో సాకి చెరువు కట్టకు తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మహిళల భద్రత, సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బతుకమ్మ వేడుకలను ఘనంగా, సురక్షితంగా, పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు.సాకి చెరువుతోపాటు బండలగూడ, రామచంద్రాపురం, అమీన్పూర్, బీరంగూడ, తెల్లాపూర్, ముత్తంగి, బొల్లారం పరిధిలోని బతుకమ్మ ఘాట్లను సైతం సద్దుల బతుకమ్మ పండుగకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, డిఈ కృష్ణవేణి, ఏఈలు లావణ్య, ఫైజన్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago