Telangana

ఓటు హక్కు పరిరక్షణ కోసం చలో లోక్ భవన్

మియాపూర్‌ ,మనవార్తలు ప్రతినిధి :

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలను నిరసిస్తూ, ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో “చలో లోక్ భవన్” నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ , మియాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్, కావూరి ప్రసాద్, రాంచందర్ గౌడ్, రవి కుమార్, ఎన్ఎస్ యూ ఐ స్టేట్ సెక్రటరీ చంద్రమౌళి, ఎన్ఎస్ యూ ఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ సాయి మనోజ్ రెడ్డి, సాయి లోహినాథ్, శశి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు సాగిన నిరసన ర్యాలీలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు, ప్రతి పౌరుడి ఓటు హక్కు పవిత్రతను కాపాడాలని కాంగ్రెస్ నాయకులు నినదించారు.లోక్ భవన్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అరెస్టులతో ప్రజల గొంతును అణచివేయలేరని, ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండేలా పారదర్శకమైన, నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని నాయకులు పేర్కొన్నారు.ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సమాధానం చెప్పాల్సిన సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ గారు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం అప్రజాస్వామిక చర్య అని పేర్కొంటూ, ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల రక్షణ, ప్రతి పౌరుడి ఓటు హక్కు భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని తెలిపారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago