Telangana

మహిళల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించాలి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, సమతుల్య ఆహారంపై అవగాహన పెంపొందించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ అభియాన్–పోషణ మాసం వారోత్సవాల కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, మహిళలకు అందిస్తున్న పోషకాహార సేవలు, ఆరోగ్య కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. చిన్నారులతో అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన కుటుంబానికి మహిళల ఆరోగ్యం పునాది వంటిదని అన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించడంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.పోషకాహార లోపం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, అందువల్ల చిన్నారులకు చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.

ప్రతి ఇంటిలో పోషకాహారంపై అవగాహన పెరిగితేనే సమాజంలో ఆరోగ్యకరమైన మార్పు సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. పోషణ్ అభియాన్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న సేవలను ఆమె అభినందించారు. పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణపై గ్రామాలు, కాలనీల్లో మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, ఐసిడిఎస్ సిడిపిఓ జయరాం నాయక్, ఎంఈఓ నాగేశ్వరరావు నాయక్, రామ్మోహన్, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago