మన వార్తలు, శేరిలింగంపల్లి :
ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముదిరాజ్ చైతన్య వేదిక డిమాండ్ చేసింది. బిసిసి భవన్ లో ముదిరాజు లకు రాజ్యంగ బద్దంగా రావాల్సిన హక్కుల కోసం”ఆలోచనపరుల మేధోమధనం” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు శివ ముదిరాజ్ మాట్లాడుతూ, ముదిరాజు లు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కలిగిన ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగాలలో చట్ట బద్ధంగా రావాల్సిన వాటా కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు అని, ప్రభుత్వం వెంటనే ముదిరాజు లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర మహిళా నాయకురాలు కోట్ల పుష్పాలత ముదిరాజ్ గారు మాట్లాడుతూ, ముదిరాజు లకు విద్య , ఉద్యోగాలలో జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ముదిరాజు లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, కురుమూర్తి, సీత మహాలక్ష్మి, సురేష్, వెంకటేష్, నరసింహ, కూరగాయల వెంకన్న, రవీందర్, మహేష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.