స్కేటింగ్లో గీతం విద్యార్థినికి బంగారు పతకం

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఇద్దరు గుజరాత్లోని అహ్మదాబాద్లోని సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించిన జాతీయ పోటీలలో రాణించి రోలర్ స్కేటింగ్లో పతకాలు సాధించినట్టు క్రీడల సంచాలకుడు కె.అరుణ్ కార్తీక్ వెల్లడించారు . హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లో బీఏ ( సెక్షాలజీ ) రెండో ఏడాది విద్యార్థిని క్వాడ్ ఫ్రీస్టైల్డ్ స్కేటింగ్ ( ఆర్టిస్టిక్ ) ఈవెంట్లో తెలంగాణ రాష్ట్రం తరుఫున పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు . అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రానిథ్యం వహించిన గీతం , విశాఖపట్నంలోని బీటెక్ విద్యార్థిని అన్మిషా భూపతిరాజు ఇదే పోటీలలో కాంస్యాన్ని సాధించినట్టు తెలిపారు . కాగా , , జాతీయ స్థాయి పోటీలలో రాణించి , పతకాలను కెవసం చేసుకున్న గీతం విద్యార్థినులు ఇద్దరినీ గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానం సిద్దవట్టం , అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *