ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్వర్యంలో
కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప స్వాములు
భక్త సంద్రంలో ముంచిన భజన గీతాలహరి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
స్వామియే శరణమయ్యప్ప.. హరి హరి వాసనే. శరణమయ్యప్ప అంటూ వేలాదిమంది అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ మార్మోగింది.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు.అభ్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. దేవత మూర్తుల ఉత్సవ విగ్రహాలతో ప్రాంగణం మొత్తం శోభాయమానంగా తీర్చిదిద్దారు.శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయం నుండి వచ్చిన ప్రత్యేక పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పడిపూజ కార్యక్రమాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్విరామంగా కొనసాగాయి.
ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి సర్వంగా సుందరంగా రంగురంగుల పువ్వులతో అలంకరించారు. ముందుగా శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ అయ్యప్ప చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీఅయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, నిర్వహించారు. పదునెట్టంబడిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వాముల పెటతుల్లి భక్తులను ఆకట్టుకుంది. అనంతరం పదునెట్టంబడిపై దీపాలు వెలిగించారు.సుమారు 10 వేల మంది భక్తులు కార్యక్రమానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, వివిధ పార్టీల రాష్ట్ర నాయకులు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…