మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కు చెందిన ముగ్గురు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, స్పారోకాన్ ఆర్కిటెక్ట్స్ లో తమ వేసవి ఇంటర్న్ షిప్ ను విజయవంతంగా పూర్తిచేసినట్టు ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. పరిశ్రమతో అనుసంధానించిన అభ్యాసం, అనుభవపూర్వక విద్య పట్ల విశ్వవిద్యాలయ నిబద్ధతలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు.స్పారోకాన్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఆర్.జబ్బర్ షేక్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు- మోసిన్, శ్రియా, మరియా తమ ఇంటర్న్ షిప్ ను పూర్తిచేశారని, తద్వారా వారు ఒక చైతన్యవంతమైన పారిశ్రామిక వాతావరణంలో వృత్తిపరమైన ఆర్కిటెక్చరల్ పద్ధతులు, డిజైన్ విధానాలు, ప్రాజెక్టు అమలుపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందినట్టు పేర్కొన్నారు.
గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ (జీసీజీసీ), విశ్వవిద్యాలయ ఇండస్ట్రీ సెల్ (యూఐసీ)ల సమన్వయంతో ఈ ఇంటర్న్ షిప్ అవకాశం లభించిందన్నారు. జీసీజీసీ సమన్వయకర్త ఆర్. స్నిగ్ధ రాయ్ ఈ ముగ్గురినీ సిఫారసు చేయగా, యూఐసీ సభ్యుడు ఆర్. అభిషేక్ కుమార్ సింగ్ ఈ ప్రక్రియను సమన్వయం చేసినట్టు తెలిపారు. విద్యార్థులకు వారి విద్యా ప్రస్థానం ప్రారంభ దశలోనే అర్థవంతమైన పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి విశ్వవిద్యాలయం చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, ఆర్కిటెక్చర్ స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బందన్ కుమార్ మిశ్రా ఈ కార్యక్రమానికి మద్దతిచ్చి, ప్రోత్సహించినట్టు వివరించారు.ఇంటర్న్ షిప్ సమయంలో, విద్యార్థులు వృత్తిపరమైన పని విధానాలు, సమకాలీన ఆర్కిటెక్చరల్ డిజైన్ పద్ధతులు, ప్రాజెక్టు సమన్వయం, కార్యాలయ సహకారంపై ఆచరణాత్మక జ్జానాన్ని పొందినట్టు తెలియజేశారు. ఈ అనుభవం వారి సాంకేతిక, వృత్తిపరమైన సామర్థ్యాలను మెరుగుపరుస్తూ, తరగతి గది అభ్యాసానికి, వాస్తవ ప్రపంచ ఆర్కిటెక్చరల్ ఆచరణకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి వారికి వీలు కల్పించిందన్నారు.
విద్యార్థుల పనితీరును ప్రశంసిస్తూ, ఆర్కిటెక్ట్ జబ్బర్ షేక్, ఆర్కిటెక్చరల్ సాఫ్ట్ వేర్ లో విద్యార్థులకున్న పటిష్టమైన పునాదిని, సమర్థవంతమైన భావ ప్రకటనా నైపుణ్యాలను, నేర్చుకోవాలనే ఆసక్తిని, వృత్తిపరమైన వాతావరణంలో కలిసికట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని అభినందించినట్టు తెలిపారు. విద్యార్థులు ప్రశంసనీయమైన వృత్తి నైపుణ్యాలను, సానుకూలతను ప్రదర్శించినట్టు ఆయన ప్రశంసించారన్నారు.ఈ ముగ్గురి అంకితభావం, సామర్థ్యాలకు ముగ్ధుడైన జబ్బర్ షేక్, ముఖ్యంగా విద్యార్థుల ఇంటర్న్ షిప్, ప్లేస్ మెంట్లు, భవిష్యత్ పరిశ్రమ భాగస్వామ్య కార్యక్రమాలలో, విశ్వవిద్యాలయ ఇండస్ట్రీ సెల్ ద్వారా గీతంతో పరిశ్రమ-విద్యా సంస్థల సహకారాన్ని బలోపేతం చేయడానికి ఆసక్తిని వ్యక్తపరిచనట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…
మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…
పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…