అల్లదుర్గ్ :మనవార్తలు
అప్పటి నిజాంనవాబ్ సర్కారు అరాచకాలను వ్యతిరేకించే వారు ఉండకూడదనే ఉదేశ్యం తో సర్కారు నిరంకుశంగా పాలన కు పోరాడుతున్న క్రమంలో కులసంఘాల ఏర్పాటును వ్యతిరేకించిన నిజాం కు వ్యతిరేకంగా అప్పటి ముదిరాజ్ ముద్దుబిడ్డలు, ధీరులు కీర్తిశేషులు కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్, సవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ లు ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి ముదిరాజ్ ల ఐక్యతకు,
ఎదుగుదలకు పాటుపడిన ధీరులు. వారి ఆశయ సాధనకై ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, జెడ్ పి చైర్మన్ కాశాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు నివ్వవడo తో ఆదివారం రోజు మెదక్ జిల్లా అలాదుర్గం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం భవనం ముందు జెండావిష్కరణ చేసి వారికి నివాళ్ళు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కళాయి బాగయ్య, సంఘం నాయకులు కనకంటి భూమయ్య, దొంత లక్ష్మయ్య, అరిగే నర్సింలు, గొండ్ల నారాయణ, కొన్యాల బుచ్చయ్య, గొండ్ల సాయిలు, మురాడి సాయిలు, నీల సాయిలు, మురాడి బేతయ్య, బుడాల బాగయ్య, ప్యారారం నర్సింలు సంఘం సభ్యులు పాల్గొని జెండావిష్కరణ చేశారు.