గీతమను సందర్శించిన జర్మనీ ప్రతినిధి బృందం…

politics Telangana

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం జర్మనీ నుంచి వచ్చిన సమాజ సాధికారత గ్రామీణ సంస్థ ( రోజ్ ) ప్రతినిధులు రాబర్ట్ ఫెల్లెనెర్ , డెటైర్లతో పాటు భారతీయ ప్రతినిధులు- రోజ్ అధ్యక్షుడు వి.శేషయ్య , ఉపాధ్యక్షుడు వె.వి.రావులు సందర్శించారు . ఈ బృందం గీతం గ్రంథాలయం , శివాజీ ఆడిటోరియంలను సందర్శించారు . జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ ఈ పర్యటనను సమన్వయం చేశారు .

ఉన్నత పాఠశాలకు టెక్నాలజీ ల్యాబ్ , సోలార్ సిస్టమ్…

తొలుత , రోజ్ బృందం రుద్రారంలోని ఉన్నత పాఠశాలకు బహుకరించిన పది హెచ్పీ కంప్యూటర్లతో కూడిన టెక్నికల్ లాబ్ , 3 కేవీ సౌర విద్యుత్ వ్యవస్థను రాబర్ట్ ఫెల్లెనెర్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు . కంప్యూటర్ విద్యాబోధన కోసం ఓ స్థానిక వాలంటీరు , నెలకు పది వేల రూపాయల వేతనంతో ఏర్పాటు చేశారు . తాము ఇచ్చిన ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాలని ఆ బృందం ఆకాక్షించింది . మేఘావృతం అయినప్పుడు కూడా విద్యుత్ను ఉత్పత్తి చేయగల సౌర ఫలకాలను తాము అమర్చామని , అదనపు విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించామని , తద్వారా కొంత మొత్తం ఆదాయం కూడా పాఠశాలకు తిరిగొస్తుందని వారు చెప్పారు . వచ్చే ఏడాది కుట్టు మిషన్లు , కుట్టు పని నేర్పించే శిక్షకుడితో పాటు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తామని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య రోజ్ బృందం హామీ ఇచ్చింది . ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పం ఉపసర్పంచ్ యాదయ్య , పలువురు గ్రామ పెద్దలు , అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . ఎన్సీసీ అధికారి శంకర్ ఆధ్వర్యంలో ఎన్సీసీ డ్రెస్లో ఉన్న విద్యార్థులతో ఏర్పాటుచేసిన స్వాగతం కార్యక్రమం , పలు శాస్త్ర ( సెన్స్డ్ ) విషయాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన రంగవల్లులు రోజ్ బృందాన్ని ఆకట్టుకున్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *