Telangana

లింగ వ్యత్యాసాన్ని అరికట్టాలి : నేహా గుప్త…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

కార్యాలయాలలో లింగ వ్యత్యాసం పెద్ద సమస్యగా మారిందని , దాని అరికట్టితే తప్ప సృజనాత్మకతను పెంపొందించలేమని , ఆవిష్కరణలను ప్రోత్సహించలేమని , కంపెనీలను అభివృద్ధి పధంలో నడపలేమని ఏజీఎస్ హెల్త్ డెరైక్టర్ నేహా గుప్తా అన్నారు . హైదరాబాద్ లోని గీతం బిజినెస్ స్కూల్ , మానవ వనరుల విభాగం ఆధ్వర్యంలో ‘ ఓ మహిళా నేతకు ఎదురయ్యే సవాళ్లు , అవకాశాలు ‘ అనే అంశంపై గురువారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు . నాయకత్వ స్థానాలలో మహిళలు అధిక సంఖ్యలో ఉండాలని సంవత్సరాల తరబడి మాట్లాడుతున్నా , ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈవోల జాబితాలో కేవలం ఆరు శాతం కంటే తక్కువగానే మహిళలున్నట్టు నాస్కామ్ గణాంకాలను ఉటంకిస్తూ ఆమె చెప్పారు . పరిశ్రమ వెవిధ్యమైన శ్రామిక శక్తిని గుర్తించినప్పటికీ కేవలం ఒక శాతం కంటే తక్కువగానే అంగవైకల్యం ఉన్న వారు పనిచేస్తున్నారని , ఇక నపుంసకుల సంఖ్య గురించి చెప్పనక్కలేదన్నారు . ఈ నపుంసకులకు ఇటు పని దొరకక , అటు కుటుంబాలు వెలివేస్తున్నాయంటూ ఆమె విచారం వెలిబుచ్చారు . ఈ పరిస్థితిని మార్చేందుకు సమాజంలో మరింత అవగాహన రావాలని , ఆయా సమస్యలపై తరచుగా చర్చించాలని , చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని నేహా గుప్తా పేర్కొన్నారు .

ప్రతి ఒక్కరికీ జీవితంలో సవాళ్లు ఎదురవుతాయని , ఒక్కసారి వాటిని అధిగమిస్తే అపార అవకాశాలు మనముందుంటాయని వర్ధమాన మేనేజర్లకు నేహా గుప్తా సూచించారు . కొత్త ఆలోచనలకు ప్రతిఘటన ఎప్పుడూ ఉంటుందని , దానిని అధిగమించి ముందుకు పోయే చొరవ మనలో ఉండాలని ఆమె స్పష్టీకరించారు . తొలుత , ఈ కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ నాగ రేఖ అతిథిని సత్కరించారు . విద్యార్థి ప్రతినిధులు మానస స్వాగతోపన్యాసం చేయగా , కీర్తన వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది . ప్రశ్నలడిగేలా విద్యార్థులను ప్రోత్సహించి , సందర్భోచితంగా జవాబులిచ్చి నేహా గుప్తా ఆకట్టుకున్నారు .

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

18 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

19 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago