Telangana

ఐఐటీ బాంబే టెక్ ఫెస్ట్ లో పోటీపడనున్న గీతం విద్యార్థులు

అంతర్జాతీయ వేదికపై ఐదు మోడళ్లతో పోటీకి సిద్ధం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఓ అంతర్జాతీయ వేదికపై తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, సృజనాత్మకతను ప్రదర్శించడానికి గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న టెక్ ఫెస్ట్-2024లో తమ ప్రతిభను చాటేందుకు గీతం ఇన్నోవేషన్ సెంటర్ కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల బృందం తమ అత్యాధునిక ప్రాజెక్టులను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. భారతీయ విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభా పాఠవాలను వెలితీసి, వాటిని ప్రదర్శించడానికి ఓ వేదికను అందించే లక్ష్యంతో 1998లో ఐఐటీ బాంబే టెక్ ఫెస్ట్ శ్రీకారం చుట్టుకుని, ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనేవారిని ఆకర్షిస్తోంది.

ఐక్యరాజ్య సమితి అంగాలైన యునెస్కో, యునిసెఫ్ లతో పాటు సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ (సీఈఈ) వంటి సంస్థల ప్రోత్సాహంతో, శాస్త్రీయ, సాంకేతిక పురోగతిని ప్రోత్సహిస్తోంది.గీతం ఐసీ బృందం ఐదు ఉత్తేజకరమైన కార్యక్రమాలలో పోటీపడి, తమ ప్రాజెక్టుల ద్వారా ఇంజనీరింగ్ నైపుణ్యం, సృజనాత్మకతను ప్రదర్శించనుంది. వేగం, చురుదనం కోసం రూపొందించిన తేలికపాటి కార్బన్ ఫైబర్ డ్రోన్ తో ఎఫ్ పీవీ రేసింగ్; ఎనిమిది సెన్సర్ ఐఆర్ శ్రేణిని కలిగి ఉన్న తెలివైన రోబోట్ తో మెష్ మెరైజ్; నిర్ధుష్ట లక్ష్యం-పోటీల కోసం రూపొందించిన బహుముఖ గ్రిప్పర్ రోబోట్ తో కోజ్ మో క్లెంచ్; ఏరోమోడిలింగ్ పోటీల కోసం రూపొందించిన నమూనాతో ఫిక్స్ డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్; వెయ్యి కిలోవాట్ మోటారు, త్రీడీ ప్రింటెడ్ 35 మిల్లీమీటర్ల ప్రొపెల్లర్ తో హై-స్పీడ్ వాటర్ నావిగేషన్ బోట్ తో రేసింగ్ వంటి ఐదు ప్రధాన విభాలలో గీతం ఐసీ బృందం పోటీపడుతోంది.

ప్రతిష్టాత్మక పోటీలకు సన్నద్ధమవుతున్న ఐసీ బృందాన్ని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఐఐటీ బాంబేలో అద్భుతమైన ప్రదర్శన చేయడం మాత్రమే కాకుండా అమూల్యమైన అనుభవాలు, బలమైన విశ్వవ్యాప్త పరిచయాలతో తిరిగి రావాలని వారు ఆకాంక్షించారు.ఈ ప్రతిష్టాత్మక పోటీలలో గీతం విద్యార్థులు పాల్గొనడం, వాస్తవ ప్రపంచ సవాళ్లను స్వీకరించడానికి విద్యార్థులను సిద్ధం చేస్తూ, సాంకేతికతలో ఆవిష్కరణలు, శ్రేష్ఠతను పెంపొందించడంలో విశ్వవిద్యాలయం నిబద్ధతను చాటిచెబుతోంది.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago