టీ-హబ్ ను సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలోని బీఫార్మసీ, ఎం.ఫార్మసీ విద్యార్థులు మంగళవారం హెదరాబాద్లోని టీ-హబ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫార్మసీ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.హెన్రి ఈ పర్యటనను సమన్వయం చేయగా, డాక్టర్ పవన్ కుమార్ సహకరించారుఈ సందర్భంగా గీతం ఫార్మసీ విద్యార్థులు టీ-హల్లో పరిశ్రమ నిపుణులతో ముఖాముఖి సమావేశాలను నిర్వహించారు. టీ-హబ్ ఈవెంట్స్ టీమ్ కె.వినయ్, సౌకర్యాల ఉపాధ్యక్షుడు – మోటివేషనల్ స్పీకర్ టి.శ్రీనివాస్లు ఆ సంస్థ స్థాపనతో పాటు దాని కార్యకలాపాల గురించి వివరించారు. టీ-హబ్ స్థాపనలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు ముందుచూపు, క్రియాశీల పాత్రను వారు తెలియజేశారు.’

టీ-హబ్ దన్నుతో వ్యవస్థాపకులుగా ఎదిగిన వారిని కూడా గీతం విద్యార్థులు కలిసి విషయ సేకరణ చేశారు. వారి ఆలోచనలు ఎలా కార్యరూపం దాల్చి, మార్కెట్లో విజయవంతం ప్రవేశించాయో తెలుసుకున్నారు. నిజజీవిత విజయ గాథలు నిర్వాహిక ఫార్మసిస్టులలో ప్రేరణను నింపాయనడంలో అతిశయోక్తి లేదు.ఈ సందర్శనలో టీ-హబ్ సౌకర్యాలు, పని ప్రదేశాలను చూడడమే గాక, స్టార్టర్లు, యువ పారిశ్రామిక నేత్తల అంకితభావం, ఆవిష్కరణలను నేరుగా చూడడం వల్ల గీతం విద్యార్థులలో వ్యవస్థాపకత, ఆవిష్కరణల పట్ల మక్కువను మరింత పెంచింది.ఈ పర్యటనను విజయవంతం చేయడానికి సహకరించిన టీ-హబ్ సీఈవో శ్రీనివాసరావు మహంకాళికి డాక్టర్ హెన్రీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్శనలో తమ విద్యార్థులకు ఒక సుసంపన్నమైన అనుభవం, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతల గురించి తెలుసుకోవడానికి తోడ్పడిందన్నారు. తరువాతి తరం వినూత్న ఫార్మసిస్ట్ ను పెంపొందించడంలో ఈ పర్యటన తమ నిబద్ధతను మరింత బలోపేతం చేసినట్టు ఆమె చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *