హెదరాబాద్
ఇండియన్ బ్యాంక్ సౌజన్యంతో , గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ ( జీహెచీబీఎస్ ) ‘ అకౌంటింగ్లో ఆధునిక ధోరణులు ‘ అనే అంశంపై ఒకరోజు జాతీయ ఈ సదస్సును ఈనెల 29 న నిర్వహించనున్నట్టు సమన్వయకర్త జీఆర్కై ప్రసాద్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . భవిష్యత్తు అకౌంటింగ్ ప్రక్రియలు , అధునాతన మార్పులను స్వీకరించడానికి అకౌంటింగ్ నిపుణులు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఈ సదస్సు ఉపకరిస్తుందన్నారు . అకౌంటింగ్లో కృత్రిమ మేథ , క్లౌడ్ అకౌంటింగ్ , అకౌటింగ్ ప్రాసెస్ ఆటోమేషన్ , అకౌంటింగ్ అనలిటిక్స్ , అకౌంటింగ్ లో బిగ్ డేటా వంటి తాజా ధోరణులపై చర్చించనున్నట్టు ఆయన తెలియజేశారు . ప్రముఖ వక్తలతో నిర్వహించే ప్యానెల్ చర్చలు , వర్క్‌షాప్‌లు ఈ సదస్సులో పాల్గొనేవారికి ఎంతో ఉపకరిస్తాయన్నారు . అకౌంటింగ్లో చోటుచేసుకుంటున్న ఆధునిక ధోరణులు , వాటిని అర్థం చేసుకోవడం , వీటిలో బీ – స్కూల్స్ పాత్ర వంటి లక్ష్యాలతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రసాద్ పేర్కొన్నారు . చెన్నయ్‌లోని ఐసీఏఐ చెర్మన్ ఎస్.పాపారావు , రాష్ట్రీయ ఇస్పాత్ నిగం పూర్వ డెరైక్టర్ ( ఫైనాన్స్ ) టీవీఎస్ కృ కుమార్ , ఎఫ్ఏసీటీ డెరైక్టర్ ( ఫైనాన్స్ ) ఎస్.శక్తిముని , టాటాస్టీల్ ఏజీఎం అరుణ్ కుమార్ పాటి తదితరులు ఈ సద్సులో ప్రముఖ వక్తలుగా పాల్గొనన్నుట్టు ఆయన తెలిపారు . పేర్ల నమోదు , ఇతరత్రా సమాచారం కోసం డాక్టర్ చంద్రభాను దాస్ ( 99380 78219 ) cdas@gitam.edu ను సంప్రదించాలని సమన్వయకర్త సూచించారు .
