– పాల్గొన్న విదేశీ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు
– ప్రత్యక్షంగా 27 , ఆన్లైన్ ద్వారా 17 వర్సీటీలతో ముఖాముఖి
మన వార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని కెరీర్ గెడైన్స్ సెల్ ఆధ్వర్యంలో ‘ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్’ను గురువారం ఘనంగా నిర్వహించారు . ఇందులో ఆస్ట్రేలియా , కెనడా , అమెరికా , బ్రిటన్ , యూరప్ నుంచి 42 ( 27 మంతి ప్రతినిధులు స్వయంగా హాజరు కాగా , 15 వర్సిటీలు ఆన్లైన్లో ) విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి . దీనికి హాజరైన విద్యార్థులకు ఆరోగ్య భీమాపై పదివేల రూపాయల తగ్గింపు , ప్రాసెసింగ్ రుసుము – దరఖాస్తుల అసెస్మెంట్లలో సగం రాయితీ వంటి ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆకట్టుకున్నారు . ఈ ఫెయిర్లో తక్షణ మూల్యాంకనం , అప్పటికప్పుడు ప్రవేశం వంటి సౌకర్యాలు కల్పించారు . వివిధ కోర్సులు , వాటిలో అడ్మిషన్ అవకాశాలు , ఫీజు , స్కాలర్షిప్లు , వసతి సౌకర్యం వంటి పలు సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఆయా వర్సిటీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడే వెసులుబాటు కల్పించారు .
ఇంజనీరింగ్ , మేనేజ్ మెంట్ , సెన్స్ , ఫార్మసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని , విదేశాలలో వారికి తగిన అవకాశాలపై అవగాహనను పెంపొందించుకున్నారు . విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలని అభిలషించే విద్యార్థులకు ఆయా వర్సిటీలు నిర్వహిస్తున్న కోర్సులు , వారి బడ్జెట్కు అనుగుణంగా ఉందా , లేదా వంటి విషయాలన్నీ ఈ ఫెయిర్ ద్వారా విద్యార్థులు , వారి తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు .
పలు కోర్సులు , వాటి రుసుములు , స్కాలర్షిప్ల గురించి సవివరంగా తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని ఎస్ఐజీ గ్రూపు వ్యవస్థాపకుడు వంశీ పర్వతనేని చెప్పారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ , ఎస్ఐజీ విదేశీ వ్యవహారాల సీఈవో ప్రీతి కోన , ఎస్ఐ సలహాదారు కేకే జెన్ , కెరీర్ గెడైన్స్ సెల్ డెరైక్టర్ ఎన్.వేణుకుమార్ తదితరులు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…