మన వార్తలు,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అడ్మిషన్ల కార్యాలయాన్ని మంగళవారం మాదాపూర్ లోని వంద అడుగుల రోడ్డులో అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ప్రారంభించారు . ఏటికేడాది పలు వినూత్న కోర్సులను ప్రారంభిస్తున్న గీతమ్ ఆయా సమాచారం జంట నగర వాసులకు సులువుగా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని మాదాపూర్ ప్రారంభించినట్టు ప్రోవీసీ చెప్పారు . గీతం ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మరింత చేరువగా , పారదర్శకంగా , కేంద్రీకృతంగా , సులువుగా అందుబాటులో ఉండేలా ఈ ఏర్పాటు చేశామన్నారు . విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యుత్తమ విద్యను బోధిస్తూ గీతం దినదినాభివృద్ధి చెందుతోందని ప్రొఫెసర్ శివప్రసాద్ వ్యాఖ్యానించారు .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గీతం సొసెటీ కార్యదర్శి ఎం . భరద్వాజ్ మాట్లాడుతూ , విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపకరించే ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు , నిబద్ధతతో కూడిన – తగిన విద్యార్హత గల అధ్యాపకులు , అత్యుత్తమ బోధన- శిక్షణలను గీతం అందిస్తోందని చెప్పారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , సోషల్ సెన్సైస్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీవీవీ నాగేంద్రరావు , కెరీర్ గెడైన్స్ కేంద్రం డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ , హైదరాబాద్ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ ఉదయకుమార్ , హెస్ఆర్ మేనేజర్ శిరీషా జెట్టి తదితరుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది .