పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
‘కాస్ట్రోక్ ప్రేరిత ప్రభావాలు, ఆన్ చీఫ్ వీఎల్విస్ఐ ఇంటర్ కనెక్ట్ పనితీరు విశ్లేషణ’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ చిప్ప ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది.వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఇ.శ్రీనివాసరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వెస్ట్- ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. చంద్రశేఖర్లు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. కాస్ట్రోక్ ప్రేరిత ప్రభావాలను అధ్యయనం చేయడం, నూతన పద్ధతులను ఉపయోగించి ఆధునాతన ఆస్ చిప్ ఏఎల్ఎస్ఇ ఇంటర్ కనెక్ట్ పదార్థాల పనితీరు విశ్లేషణపై ఈ పరిశోధన దృష్టి సారించినట్టు తెలిపారు.ప్రవీణ్ కుమార్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సీహెచ్ సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, రెసిడెంట్ డెరెక్టర్ : డీవీవీఎస్ఆర్ వర్మ, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.ఆర్.శాస్త్రి, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.సీతారామయ్య, ఈఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టి.మాధవి, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది. పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.