పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
అల్యూమినియం/గ్రాఫెట్ లోహ మిశ్రమాల సంశ్లేషణ- సూక్ష్మ నిర్మాణం- యాంత్రిక లక్షణాలు, వాటి ప్రవర్తన అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ల శ్రీధర్‌ను డాక్టరేట్ వరించింది.హెదరాబాద్ (సుల్తాన్పూర్)లోని జేఎన్టీయూహెచ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.ప్రసన్న లక్ష్మి ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.శ్రీధర్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం హెదరాబాద్ లోని ప్రతిష్ఠాత్మక జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.ఆర్.శాస్త్రి, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
