సాంకేతిక ప్రదర్శనలో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు

politics Telangana

– జాతీయస్థాయి బిట్స్ టెక్ ఎక్స్పోలో ద్వితీయ , తృతీయ స్థానాలు కైవసం

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చాటి , తమ అత్యుత్తమ సాంకేతికత , ప్రదర్శనలకు గాను ద్వితీయ , తృతీయ స్థానాలను కెవసం చేసుకున్నారు . జీ – ఎలక్ట్రా ( స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ ) విద్యార్థులు ఇటీవల బిట్స్ హైదరాబాద్ వార్షిక ఫెస్ట్ ‘ ఆటమ్స్ – 22’లో తమ హోం ఆటోమేషన్ , బ్లెండెడ్ విజన్ ప్రాజెక్టులకు గాను నగదు పురస్కారాన్ని పొందినట్టు ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . దేశ నలుమూలల నుంచి పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని , తమ నమూనాలు / ప్రోటోటెస్ట్ ప్రాజెక్టులను ప్రదర్శించినట్టు ఆమె తెలిపారు . గీతం ఈఈసీఈ రెండో ఏడాది విద్యార్థులు సి.దీపక్ , జి . అనిరుధ్ , బి.గురుప్రీత్ సింగ్ , సీహెచ్ . అమూల్యల బృందం హోం ఆటోమేషన్ ప్రాజెక్టును , మూడో ఏడాది విద్యార్థులు ఎంవీఎస్ఎన్ ప్రణవ్ , కె . మణికంఠ , దివ్యసాగర్ బృందం విజన్ ప్రాజెక్టులను ప్రదర్శించి , న్యాయమూర్తుల ప్రశంసలను పొందినట్టు డాక్టర్ మాధని వివరించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పరిశోధనా ఇంజనీర్ వె.దామోదర్రావు , జీ – ఎలక్ట్రో క్లబ్ సమన్వయకర్తలు డాక్టర్ డి.అనిత , ఎం.నరేష్ కుమార్లు తదితరులు జాతీయస్థాయి పోటీలలో రాణించిన ఈ రెండు జట్ల సభ్యులను అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *