గీతమ్ ప్రమాణ జోష్

Telangana

_అలరించిన మూడు రోజుల చెక్నో-మేనేజ్ మెంట్-కల్చరల్ ఫెస్ట్ మిన్నంటిన కోలాహలం.

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఎటు చూసినా పండుగ వాతావరణం.. వెళ్తానిక ప్రదర్శనలు.. శాస్త్రీయ పోటీలు.. ఉప్పొంగే ఉత్సాహం, ‘హిప్- ‘హిప్ హుర్రే’ నినాదాలు.. కేరింతలు.. విశాల క్రీడా మైదానంలో అందంగా తీర్చిదిద్దిన వేదిక.. కాంతులు వెదజల్లే విద్యుత్ దీపాలు.. డిజిటల్ స్క్రీన్లు.. హోరెత్తించే సౌండ్ సిస్టమ్స్.. అందంగా అలంకరించిన విలురకాల స్టాళ్ళు.. ఇది గీతం విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలోని దృశ్యాలు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘ప్రమాణ-2023″ పేరిట మూడు రోజులపాటు నిర్వహించిన ‘టెక్నో-మేనేజ్ మెంట్ – కల్చరల్ ఫెస్ట్’ శుక్రవారంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ముగిసింది. ఇది విద్యార్థులలో జోష్ను పెంచడంతో పాటు అనేక మధుర స్మృతులను నింపింది.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ డీఐజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్. (ఐఈటీఈ) అధ్యక్షుడు ప్రొఫెసర్ వి. గుణశేఖర్రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఆరంభమైన మూడు రోజుల సాంకేతిక యాజమాన్య, సాంస్కృతికోత్సవాలు భారతీయ నేపథ్య గాయకులు శ్రీరామచంద్ర, హారిక నారాయణు తెలుగు- హిందీ పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. విద్యార్థులలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి ‘ప్రమాణ ఓ వేదికగా తోడ్పడింది.

తొలిరోజు, సాంకేతిక కార్యశాలలు, ట్రెజర్ హంట్, బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, టోక్కో టౌన్ అనిమే మీట్ అప్, కార్నినాల్, సంగీత నృత్య ప్రదర్శనలు జరిగాయి. రెండో రోజు ఆర్యన్ శర్మ డాన్స్ వర్క్స్తో పాటు ఆర్ట్ ఎటాక్, ఐడియాథాన్, హ్యాకథాన్, యూత్ పార్లమెంట్, ఒకరోజు వ్యవస్థాపకుడు కార్యక్రమాలు విద్యార్థుల మేధకు పదును పెట్టగా, షార్ట్ ఫిల్మ్ వారిలోని దర్శకత్వ ప్రతిభను వెలికితీసింది. ‘బ్యాండ్ నెట్ – బ్యాండ్ ఎల్జియమ్’, ‘సెలెస్టా రన్వే కాంటెస్ట్’ కుర్రకారు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. చివరి రోజు మీట్ అండ్ గ్రీట్, జాయ్ అండ్ బ్యాండ్లతో పాటు ప్రముఖ డీజే లాస్ట్ స్టోరీస్, ప్రపంచ ప్రసిద్ధ డీజే తెలి నిక్ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ నెట్ ఆద్యంతం అలరించాయి. విద్యార్థుల కోలాహలం మిన్నంటి, డ్యాన్సులు, కేరింతలతో ప్రాంగణమంతా మారోగిపోయింది.

పలు ఇతర కళాశాలల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనడంతో ప్రాంగణమంతా క్రిక్కిరిసి పోయింది. విద్యార్థి వేడుకలను పర్యవేక్షించి, విజయవంతం కావడానికి విద్యార్థులకు తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. గీతం ప్రోవీసీ ప్రొఫెసర్ డీఎగ్రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ పర్యవేక్షణలో, ఫెస్ట్ చెర్మన్ డాక్టర్ సి. త్రినాథరావు, క్రమశిక్షణ కమిటీ సభ్యులు తదితరులు ఈ వేడుక విజయవంతం కావడానికి విద్యార్థులకు సహకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *