మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని కళాకృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘ ఓపెన్ మెక్ష్ ‘ కార్యక్రమాన్ని క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు . విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న నెపుణ్యాలను వెలికితీయడానికి దీనిని ఏర్పాటు చేశారు . పాటలు , నృత్యం , కవిత్వం చదవడం , సంగీతం , వాద్యపరికరాలను సృ జనాత్మకంగా వాయించడం , కథలు చెప్పడం , మె , మిమిక్రీ వంటి అనేక రకాల ప్రతిభను విద్యార్థులు ప్రదర్శించారు . స్టూడెంట్ లెఫ్ డెరైక్టరేట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ మాట్లాడుతూ , విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచేలా చెతన్యవంతులను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు .
కార్యక్రమ నిర్వాహక విద్యార్థి స్నేహిత్ మాట్లాడుతూ , ‘ ఓపెన్ మెక్ష్ ఎల్లప్పుడూ సాంస్కృతికంగా సాధికారత కలిగిస్తుంద’ని అన్నారు . సుజయ్ ( సాంస్కృతిక ) మహీంద్రా ( మార్కెటింగ్ ) వివియన్ ( సాహిత్య ) శ్రేయ ( నృత్యం ) ఆదిత్య ( సంగీతం ) సింధు ( కళలు ) శ్రీహరి ( గ్రాఫిక్ డిజెన్ ) ఆయా బృందాలకు నాయకత్వం వహించగా , స్టూడెంట్ లెఫ్ అసోసియేట్లందరూ ఈ కార్యక్రమ విజయవంతానికి తమవంతు సహాయ సహాకారాలను అందించారు . నిర్వాహకులను అధ్యాపకులు ప్రశంసించడమే గాక , ఇటువంటి కార్యకలాపాల వల్ల సహజమైన ప్రతిభ ఉన్న విద్యార్థులు వెలికివస్తారని ఆశాభావం వెలిబుచ్చారు .
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…