మనవార్తలు ,పటాన్ చెరు:
‘ పాశ్చాత్య దేశాలలో ఆల్ సెయింట్స్ డే సందర్భంగా ప్రతియేటా అక్టోబర్ 31 న హలోవీన్ జరుపుకుంటారు . భయానక ఉత్సవంగా విశ్వవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హాస్టల్ విద్యార్థులు మంగళవారం క్రీడా మైదానంలో జరుపుకున్నారు . ఈ సందర్భంగా విద్యార్థులు విభిన్న వేషధారణలతో అలరించారు . ముఖానికి రంగులు , సరదా ఆటలతో పాటు సంగీతం / బ్యాండ్ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు . స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ స్వాగత వచనాలతో ఆరంభమైన ఈ వేడుకలు తేనీటి విందుతో ముగిశాయి.