గాయత్రి తనూజకు డాక్టరేట్ ‘…

politics Telangana

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

సింథసిస్ , క్యారెక్టరెజేషన్పై పరిశోధన : తేలికపాటి అప్లికేషన్ల కోసం బల్క్ మెటాలిక్ గ్లాసెస్ ‘ అనే అంశంపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని జి.గాయత్రి తనూజను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి , గీతం స్కూల్ ఆఫ్ సెట్స్లోని భౌతిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్.బాలాజీరావులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .

ప్రస్తుత బీఏంఐ నెట్వర్క్ Ti / Nb కంటెంట్ వాంఛనీయ పరిమాణాలను కలపడం వల్ల పెళుసుదనాన్ని నివారించడానికి , స్ట్రెయిన్ క్రాకింగ్ సమస్యలను అధిగమించడానికి , ఏరోస్పేస్ , తేలికపాటి వాహన అనువర్తనాలకు అనుగుణంగా అవసరమైన పిట్టింగ్ , అది పాడవకుండా నిరోధించడంలో సహాయపడిందని ఆమె తెలియజేశారు . గాయత్రి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *