మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ కు చెందిన బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రవికుమార్ యాదవ్ శాలువా కప్పి, కేక్ కట్ చేసి గణేష్ ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందు ముందు మరెన్నో వేడుకలు జరుపుకొని జీవితంలో, రాజకీయాల్లో పైకి రావాలని రవికుమార్ యాదవ్ ఆకాంక్షించారు. మంచి భవిష్యత్ ఉన్న నాయకులు గణేష్ ముదిరాజ్ అని, సేవా, సామజిక రంగాల్లో ఎప్పుడు ముందుంటారని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, కొంచె శివరాజ్ ముదిరాజ్, నర్సింగ్ రావు, నరేష్, హరి తదితరులు పాల్గొన్నారు.